0

Brahmanadham Son latest gautham and chaitanya movie release date on shivarathri 27-02-2014 

మహా శివరాత్రి కానుకగా 'బసంతి' విడుదల 


తీవ్రవాదం నేపధ్యంలో సాగే వైవిధ్యమైన చిత్రమిది. 'బాణం' తరువాత నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కధ, కధనం సంభాషణలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకముందని అన్నారు దర్శకుడు చైతన్య దంతులూరి. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై ఈ 'బసంతి' రూపొందుతోంది.
కధానాయకునిగా తాను 'బసంతి' లో పోషిస్తున్న పాత్ర కొత్తగా ఉంటుందని,నటునిగా తనకు విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు'రాజా గౌతమ్'
కధానాయకుడు గా  'రాజా గౌతమ్' నటిస్తుండగా, ఆయన సరసన 'అలీషా బేగ్'  నటిస్తున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదల అయిన పాటలు ప్రజాదరణ పొందటం ఈ చిత్రం సాధించబోయే విజయం పై మానమ్మకాన్నిమరింత  పెంచిందని.
చిత్ర నిర్మాతలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే, మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత,దర్శకుడు చైతన్య దంతులూరి తెలిపారు,
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో 'తనికెళ్ళ భరణి,షాయాజీ షిండే,రణధీర్ గట్ల, నవీన్ జాక్సన్,డా.కే.ఎస్.ఐ.ఆనంద్,ధన్ రాజ్,మణికిరణ్, దయ నటిస్తున్నారు, ఈ చిత్రానికి పాటలు కృష్ణ చైతన్య,శ్రీమణి: కెమెరా: అనిల్ భండారి,మాటలు. శ్రీకాంత్ విస్సా: కూర్పు: మార్తాండ్.కె. వెంకటేష్: 

సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల 
కధ-కధనం-నిర్మాత-దర్శకత్వం: చైతన్య దంతులూరి


Post a Comment

 
Top