0

Nikihil, Swathi Latest movie Karthikeya Movie Released On August 1st


ఆగస్టు 1న  'నిఖిల్,స్వాతి' ల 'కార్తికేయ'  చిత్రం  విడుదల

'మాగ్నస్ సినీ ప్రైమ్' ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం 'కార్తికేయ'

యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా తాము నిర్మిస్తున్న'కార్తికేయ' చిత్రం  నిర్మాణం ముగింపు దశలో ఉంది,  ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందించటం ఎంతో  ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందు మొండేటి  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు. ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియో కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన లభించిందని నిర్మాత తెలిపారు. ఆగస్టు 1న   చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలు జరుగు తున్నాయని ఆయన అన్నారు. కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్  లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో నమ్మకముందని నిర్మాత తెలిపారు.
ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళభర ణి,రాజా రవీంద్ర రావు రమేష్, ప్రవీణ్,తులసి,కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు,శివన్నారాయణ, జయప్రకాశ్, శంకర్ మెల్కోటే  నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వనమాలి,కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ : రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి,
నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి

Post a Comment

 
Top